Monday, December 23, 2024

ట్రాన్స్జెండర్ హీరోయిన్గా మొదటి సినిమా..-ఓరుగల్లు9నేషనల్ టీవీ

ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:-ఇండస్ట్రీ ఏదైనా సినిమాల విషయంలో మాత్రం ఆడియన్స్ కొత్తదనం కోరుకుంటున్నారు. అలాంటి సినిమాలనే ఆదరిస్తున్నారు కూడా. మేకర్స్ కూడా ఆ వైపుగా అడుగులువేస్తున్నారు. ఒకప్పటిలాగా ఆరు పాటలు. నాలుగు ఫైట్స్ అంటే కష్టం. ఆ జమానా పోయింది. అందుకే మేకర్స్ కూడా కొత్త కొత్తవి ట్రై చేయడానికి ఇష్టపడుతున్నారు. తాజాగా కన్నడ ఇండస్ట్రీ నుండి రానున్న ఈ సినిమా కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్నారు ఆ సినిమా మేకర్స్. అందేంటంటే.. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఒక ట్రాన్స్జెండర్ ను ఫుల్ లెన్త్ హీరోయిన్గా తీసుకొని సినిమా చేస్తున్నారు. ఆ ట్రాన్స్జెండర్ హీరోయిన్ మరెవరో కాదు వైశాలి. ఆమె హీరోయిన్ గా మిస్టర్ అండ్ మిసెస్ మన్మథ అనే అనే సినిమా తెరకెక్కుతోంది. సుబ్రమణి హీరోగా నటిస్తున్న ఏ సినిమా.. త్వరలోనే థియేటర్స్ లోకి రానుంది. ఇక ట్రాన్స్జెండర్ హీరోయిన్గా నటిస్తుండంతో.. ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు చాలా మంది సినిమాల్లో కనిపించారు కానీ.. హీరోయిన్ గా చేయడం మాత్రం ఇదే మొదటిసారి కావడం విశేషం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular