ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 26 :
ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తల మహా సమ్మేళనం కరపత్రాలు శనివారం నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండల్ కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా ప్రచార కమిటీ సభ్యులు రామగిరి రవీందర్ మాట్లాడుతూ నవంబర్ 3 న హైదరాబాదులోని ఆదిభట్ల పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో మహా సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమ్మేళనంలో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టనున్న పార్టీ కార్యక్రమాలు, ప్రణాళికలు కార్యకర్తల సమక్షంలో పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహరాజ్ వెల్లడిస్తారని పేర్కొన్నారు. 90 శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యం లేక విద్యా , వైద్యం , ఉపాధి , ఇల్లు, భూమి ఏమి లేకుండా పోయాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు రాజు మహారాజ్ వినోద్ మహారాజ్ బరుకుంట్ట ప్రవీణ్ దర్శనం ఎల్లన్న ముత్యం సోషల్ మీడియ ఇంచార్జ్ సుధాకర్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.