భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలు…
ఓ పక్క గొలుసు దొంగతనాలు..
మరోపక్క ఆలయాలలో చోరీ.. ఇంకోపక్క దుకాణాలలో చోరీ..
జిల్లాలో విచ్చలవిడిగా నిషేధిత గుట్కా అమ్మకాలు…
నిమ్మకు నీరెత్తని పోలీసులు.. కేసులు నమోదు చేసుకోవడం తప్ప.. ప్రజలకు భరోసా ఇవ్వడంలో వెనుకడుగు…
నెలలు గడుస్తున్న పెండింగ్ లోనే కేసులు..
ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 26 :
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వరుసగా జరుగుతున్న దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో ప్రజలలో అభద్రతాభావం పెరిగిపోతుంది. ఓ పక్క గొలుసు దొంగతనాలు, మరోపక్క ఆలయాలలో చోరీ.. అంతేకాకుండా దుకాణాలలో చోరీ.. తాజాగా నేటి ఉదయం చిట్యాల బస్టాండ్ వెనుక గల డీజే దుకాణంలో విలువైన సామాగ్రి చోరి.. అంతేకాకుండా జిల్లాలో విచ్చలవిడిగా నిషేధిత గుట్కా అమ్మకాలు జరుగుతున్నప్పటికీ పోలీసులు స్పందించడం లేదంటూ జిల్లాలోని ప్రజలు విమర్శిస్తున్నారు.. సంఘటన జరిగినప్పుడు చుట్టం చూపుగా వచ్చి కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ ఇప్పటివరకు కేసులను చేదించిన సందర్భాలు లేవని పలువురు విమర్శిస్తున్నారు.
జిల్లాలో వరసగా గొలుసు దొంగతనాలు..
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని నెలల నుండి వరుసగా గొలుసు దొంగతనాలు జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, గొలుసు దొంగలను పట్టుకోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. భైంసా, వానలపాడ్, నిర్మల్ , రాంపూర్ , నర్సాపూర్ జి తదితర ప్రాంతాలలో సుమారు గత మూడు నెలలలో వరుసగా దొంగతనాలు జరిగినప్పటికీ పోలీసులు దొంగలను పట్టుకోవడంలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. దొంగతనము జరిగిన రెండు రోజులు హడావిడి చేస్తూ పోలీసు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అనంతరం నీరుగారి పోతున్నారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రజలను, ప్రజల ఆస్తులను రక్షించడానికి పోలీసులకు సరికొత్త వాహనాలు ఇచ్చినప్పటికీ పెట్రోలింగ్ తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు అంటూ బాధితులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా గతంలో నిర్మల్ పట్టణంలోని ఓ ప్రదేశంలో ఓ దొంగ మహిళ మెడలో నుండి గొలుసు దొంగతనం చేసేటప్పుడు స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగిస్తే, వారిని మేమే పట్టుకున్నాము అంటూ పత్రికా ప్రకటనలు చేశారు. కానీ వాస్తవానికి దొంగతనం చేసిన దొంగలను ఇప్పటివరకు పట్టుకోలేదు.. దీంతో ప్రజలు ముఖ్యంగా మహిళలు ఒంటరిగా రోడ్డుపై వెళ్లాలంటే భయపడుతున్నారు.. అంతేకాకుండా జిల్లాలోని ప్రధాన ఆలయాలలో సైతం ఈమధ్య దొంగతనాలు జరగగా వాటిని కూడా పోలీసులు ఇంతవరకు చేదించలేదనేది పలువురి విమర్శ. ఆలయాలలో సీసీ కెమెరాలు బిగించుకోవాలి అంటూ సమావేశాలు ఏర్పాటు చేసి పోలీసులు చేతులు దులుపుకుంటున్నారంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. అర్ధరాత్రి సమయంలో దొంగలు దుకాణాలను, వైన్స్ లను వదలడం లేదు. నిన్న అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్లక్ష్యంతో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఓ డీజే దుకాణంలో దొంగతనం జరిగింది.. జాతీయ రహదారికి పక్కనే ఉన్న దుకాణాలలో దొంగతనం జరిగితే ఊర్లో ఉన్న దుకాణాలకు రక్షణ ఏది అంటూ వ్యాపారస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు…
కుంటాల గ్రామంలో సోయ దొంగతనం ఫైల్ ఫోటో