Friday, November 15, 2024

పోలీస్ విది విధానాల గురుంచి, నూతన పరికరాల గురుంచి విద్యార్థులు తెలుసుకోవాలి.

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) కార్యక్రమాల్లో భాగంగా జిల్లా ఎస్పీ డా .జానకి షర్మిల ఐపిఎస్ ఆదేశాలతో అవినాష్ కుమార్ ఐపిఎస్ నేతృత్వంలో శుక్రవారం మధ్యాహ్నం భైంసా గ్రామీణ పోలీస్ స్టేషన్ ఆవరణలో లో ఓపెన్ హౌస్ కార్యక్రమం లాంఛనంగా నిర్వహించారు

ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 25 :

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు దాదాపు 250 మంది ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో అవినాష్ కుమార్ ఐపిఎస్ ఏ.ఎస్పి స్వయంగా పిల్లలకు ఆయుధాల గురించి, పోలీసు చట్టాల గురించి, సీసీ కెమెరాల వల్ల కలిగే ఉపయోగాల గురించి, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ డివైస్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్, ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి వివరించారు.

పోలీసులు ఉపయోగిస్తున్న ఆయుధాల గురించి, ఏకే 47, ఎస్ఎల్ఆర్, కార్బన్, 9mm పిస్తాల్, బీడీ టీమ్, ఫింగర్ ప్రింట్, క్లూస్ టీమ్, షీటీమ్, భరోసా, కమాండ్ కంట్రోల్ రూమ్ సీసీ కెమెరాలు, రోడ్డు ప్రమాదాలు స్పీడ్ లేజర్ గన్, ట్రాఫిక్ రూల్స్, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన కిట్, డాగ్ స్క్వాడ్స్, సైబర్ క్రైమ్ తదితర స్టాల్స్ ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు సిబ్బంది విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఏ.ఎస్పి మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాల గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు మరియు ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని మరియు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని సైబర్ నేరాల వలలో పడకుండా తీసుకోవలసిన జాగ్రత్త చర్యల గురించి విద్యార్థినీ విద్యార్థులకు వివరించారు విద్యార్థినీ విద్యార్థులు స్వయంగా ఆయుధాల గురించి తదితర అంశాల గురించి వాటి పేర్లు అడిగి తెలుసుకున్నారు. బాలికలు మహిళల రక్షణకు ఏర్పాటుచేసిన భరోసా కేంద్రం యొక్క సేవల గురించి అవగాహన కల్పించడం జరిగింది. గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి, డయల్ 100, సైబర్ నేరం జరగగానే 1930 టోల్ ఫ్రీ నెంబర్ ల గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఏ ఎస్పి తో పాటు భైంసా రూరల్ ఇన్స్పెక్టర్ నైలు , ఎస్ఐ శ్రీనివాస్, ఏఆర్ సిబ్బంది మరియు విద్యార్ధిని విద్యార్థులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular