Friday, November 15, 2024

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిర్మల్ సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో “మెగా రక్త దాన శిబిరం”

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి వారిపాలిట దేవుళ్ళుగా మారండి.. : జిల్లా ఎస్పీ డా.జి. జానకి షర్మిల ఐపిఎస్.

ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 25 :

శుక్రవారం రోజు మొత్తం 120 యూనిట్ల రక్త సేకరణ

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల త్యాగలను స్మరిస్తూ నిర్మల్ పట్టణం లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్మల్ సబ్ డివిజన్ పోలీస్ వారు పట్టణ ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ వారి సహకారం తో ఏర్పాటు చేసిన మెగా రక్త దాన శిబిరం కు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ క్యాంప్ ని ప్రారంభించారు.

అనంతరం ఎస్పి మాట్లాడుతూ…అమరవీరులు సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని వారి త్యాగాలను వెలకట్టలేమన్నారు. అమరుల త్యాగ ఫలంగానే ఈరోజు దేశం, రాష్ట్ర ప్రజలందరూ శాంతియుతంగా, ప్రశాంతంగా ఉన్నారన్నారు. రక్త దానం చేయడం అనేది ఒక సామాజిక సేవా కార్యక్రమం అని, క్లిష్ట పరిస్థితులల్లో ,ఉన్నప్పుడూ ఆపదలో ఉన్న ప్రాణాలు రక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుందని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి వారిపాలిట దేవుళ్ళుగా మారతారు అన్నారు. థలసేమియా, క్యాన్సర్, మెడికల్ ఎమర్జెన్సీ పేషంట్లు, బ్లడ్‌ కేన్సర్‌ రోగులు, హిమోఫీలియా, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి, తదితర జబ్బుల తో బాధపడుతున్న వారి కోసం ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఇటువంటి సామాజిక సేవలలో పాల్గొని తోటి వారి ప్రాణాలను కాపాడటములో తమవంతు సహాయము గా రక్త దానం చేయడం అనేది ఒక సామాజిక సేవా కార్యక్రమం అని, ఆపదలో ఉన్న ప్రాణాలు రక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుందని మిమి ఆరోగ్య పరిస్థితి ని బట్టి ఆరోగ్యంగా ఉండే ప్రతి మనిషి 6 నెలలకొకసారి రక్తదానం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేసిన డిఎస్పీ గంగా రెడ్డి టీమ్ నీ ప్రశంసించారు. అనంతరం రక్తదానం చెసిన వారీకి పండ్లు మరియు పానీయాలు అందించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో నిర్మల్ డిఎస్పీ గంగా రెడ్డి , ఇన్స్పెక్టర్ లు ప్రవీణ్ కుమార్, రామ కృష్ణ , నవీన్ కుమార్ , ఆర్ఐ లు రామ్ నిరంజన్ రావు, శేఖర్ , ఎస్సైలు , ఆర్.ఎస్సైలు , పోలీస్ సిబంది మరియు రక్త దాన ఉత్సాహకులు పాల్గొన్నారు.

రక్తదానం చేస్తున్న డి.ఎస్.పి

రక్తదానం చేస్తున్న పోలీస్ సిబ్బంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular