ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 24:
నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని పెద్ద హనుమాన్ మందిర ఆలయ ఆవరణలో గురువారం డీసీఎంఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ జెడ్పిటిసి చిన్నరామయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ సర్పంచ్ అరుగుమిది రాంరెడ్డి, గడ్డం ఇంద్రకరణ్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ యం.ఏ. అజీమ్, కో ఆప్షన్ ఫాసి,కొండ్ర రమేష్, గాదె సంతోష్, గఫర్,సంజీవ్ రెడ్డి,రమేష్ లు పాల్గొన్నారు.