Monday, December 23, 2024

పేరుకే 30 పడకల ఆసుపత్రి

శాశ్వత వైద్యులు లేరు..సిబ్బంది లేరు…! ఏళ్లుగా ఎదురు చూపులే
ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులు బాధితులు..                   
ఏడాది క్రితమే పిహెచ్ సీ నుండి సిఎస్‌సి గా గుర్తింపు

ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి,జులై 10 :

నర్సాపూర్( జి) మండల కేంద్రంలో పరిసర గ్రామాలకు చెందిన వారికి స్థానికంగానే పూర్తిస్థాయి మౌలిక వసతులతో ఆధునాతనమైన వైద్య సేవలను అందించేందుకు 30 పడకల ఆసుపత్రిని 2016 లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు. అది జరిగి కొన్ని ఏళ్లు అవుతున్న సదరు 30 పడకల ఆసుపత్రిలో ఆ స్థాయి సౌకర్యాలు లేకపోగా శాశ్వత వైద్యులు సిబ్బంది కూడా నియమించకపోవడంతో ఆసుపత్రికి నిత్యం వచ్చే గర్భిణీలు ఇతర సాధారణ రోగులు నిత్యం పడరాన్ని పాట్లు పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఇక్కడ ఆధునాతనమైన నమూనాలో 30 పడకల నూతన భవనాన్ని నిర్మించినప్పటికీ తగిన విధంగా సౌకర్యాలు కల్పించకపోవడంతో పది స్థానికులకు శాపంగా మారుతుంది.

 ఏడాది క్రితమే పిహెచ్ సి నుండి సిఎస్ సిగా గుర్తింపు

మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ప్రసూతి 30 పడకల ఆసుపత్రిని అప్పటి ప్రభుత్వం పీహెచ్ సీ నుండి సిఎస్ సీ గా అధికారిక గుర్తింపు ఇచ్చింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో నుంచి వైద్య విధాన పరిషత్ పరిధిలోకి వెళ్లిన సదర్ ఆసుపత్రిలో ఏడాది కారణంగా ఎలాంటి నయా పైసా మార్పులు రాకపోగా కావలసినంత వైద్యులు సిబ్బందిని కూడా నియమించకపోవడం ఆందోళనను కలుగజేస్తుంది. స్థానికంగా ఉన్న ఈ ఆసుపత్రిలో ప్రతిరోజు 100 నుంచి 150 మంది రోగులు గర్భిణీలు చికిత్సలు ఇతరత్ర వాటి కోసం వస్తున్న ఆ స్థాయి సౌకర్యాలు వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో తీవ్ర మానసిక శోభకు గురై నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళవలసి వస్తుంది.

శాశ్వత వైద్యులు లేరు సిబ్బంది లేరు.

మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో కావలసినంత వైద్యులు సిబ్బంది లేకపోవడంతోనే ఇతర సమస్యలు ఎదురవుతున్నాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు వైద్య విధాన పరిషత్ ఉన్నత స్థాయి అధికారులు కూడా పేర్కొంటున్నారు. వైద్య విధాన పరిషత్ అధికారిక ఆదేశాలు నియమ నిబంధనల ప్రకారం 30 పడకల ఆసుపత్రిలో కనీసం 14 మంది శాశ్వత వైద్యులు,జనరల్ సర్జన్ లు, ఎక్స్ రే సెంటర్, ల్యాబ్ ఇన్చార్జీలతో పాటు తగిన అధికారిక సిబ్బంది అత్యవసరం ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 14 మంది స్టాఫ్ నర్సుల నియమాలు కానీ చేపట్టిన ఆ స్థాయి సౌకర్యాలు కూడా ఆసుపత్రిలో లేకపోవడంతో వారు ఏమి చేయలేకపోతున్నారు. అదేవిధంగా 24 గంటల ఆసుపత్రి సేవలు అందించేందుకు అవసరమున్న వైద్యులు సిబ్బంది వినియోగిత యంత్రాలు ఇతరత్రా వాటిని కూడా ఏర్పాటు చేయవలసి ఉంది.

శాశ్వత వైద్యులు సిబ్బంది అవసరం..ఇన్చార్జి సూపరింటెండెంట్
డా. దేవేందర్ రెడ్డి.

నర్సాపూర్ (జి ) మండల కేంద్రంలోని ప్రభుత్వ 30 పడకల ఆసుపత్రిలో శాశ్వత వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏడాది క్రితమే ఈ ఆసుపత్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి సిఎస్ సీ స్థాయిగా మారింది. అయినప్పటికీ శాశ్వత వైద్యులు, సిబ్బంది నియామకాలు లేవు. ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు ఇతర సిబ్బంది చాలామంది ఇన్చార్జిలే. 24 గంటల వైద్య సేవలు అందాలంటే పూర్తిస్థాయి వైద్య ఇతర సిబ్బందితోపాటు తగిన సౌకర్యాలు కల్పించాలి. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం.

గైనకాలజిస్ట్ కోసం ఎదురుచూస్తున్న గర్భిణీ స్త్రీలు

మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం రోజు డాక్టర్ కోసం ఉదయం 10:00గం నుండి 11:35ని వరకు గర్భిణీ మహిళలు వేచి ఉన్నారు 11:40ని డాక్టర్ లీవ్ లో ఉన్నారని అక్కడ సిబ్బంది చెప్పడం ద్వారా గర్భిణీ స్త్రీలు వెను తిరగాల్సి వచ్చింది, గైనకాలజిస్ట్ డాక్టర్ పైన నర్సాపూర్ జి గ్రామానికి చెందినటువంటి యువకుడు గత నెల లిఖితపూర్వకంగా గైనకాలజిస్ట్ సమయానికి రావడం లేదంటూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ఉన్నత అధికారులు అధికారులు స్పందిస్తారని ప్రజలు కోరుకుంటున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular