ఎంపీపీ కందకట్ల కళావతి నరహరి
ఓరుగల్లు 9 నేషనల్ టీవీ ప్రతినిధి: వరంగల్ జిల్లా సంగెం మండలం ఈరోజు సంగెం మండలంలో రైతువేదికలో కరోనా కొత్త వేరియంట్ JN-1 పైన అవగాహనా సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీపీ కందకట్ల కళావతి నరహరి వారు మాట్లాడుతూ కరోనా పట్ల ప్రజలు జాగ్రత్త గా ఉండాలని అన్నారు .గ్రామాలలో గ్రామపంచాయతీ సెక్రెటరీ లు శానిటేషన్ పనులు క్రమం తప్పకుండా చేయించాలి .anm లు మరియు ఆశ వర్కర్లలు గ్రామాలలో కరోనా పైన ప్రజలకు అవగాహనా కల్పించాలి అని అన్నారు .గ్రామాలలో డప్పు సాటింపులు చేసి.ప్రజలను మోటివేషన్ చేయాలి కరోనా పైన అవగాహన తేవాలని వారికి సూచించారు.ఈ కరోనా విపత్తు లో మిమ్మల్ని, మీతో పాటు అందర్నీ రక్షించుకుందుకు చేయాల్సినవి,తరుచు చేతులు శుభ్రపరుచుకోవాలి. సబ్బు మంచి నీళ్ల తో చేతులు శుభ్రపరుచుకోవాలి. శానిటైజర్ వాడాలి! మీరు తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు కర్చీఫ్ లేదా టిష్యూ ముఖానికి అడ్డు పెట్టుకోవాలి.వాడిన టిష్యూలని ఇంకా మాస్క్ లని మూసేసిన చెత్తకుండీలలో మాత్రమే ఎప్పటికప్పుడు వేయాలి.జ్వరం, ఊపిరి తీసుకోవడం లో ఇబ్బందులు,దగ్గు లేదా జలుబు ఉన్నట్లయితే వెంటనే వైద్యులని సంప్రదించండి! వైద్యుని దగ్గరికి వెళ్లే ముందు.మీకు పైన చెప్పిన లక్షణాలు కనుక ఉంటే.జన సమూహాలకి దూరంగా ఉండండిమీకు దగ్గు లేదా జ్వరంగా ఉంటే ఇతర వ్యక్తులకి దూరంగా ఉండండి. జనం లో ఎక్కువగా తిరగడం సాధ్యమైనంత తక్కువ చేయండి. దగ్గు లేదా జ్వరం ఉన్న వాళ్లకి కనీసం 1 మీటర్ దూరం పాటించండి.మీ కళ్ళని, ముక్కుని, నోరుని లేదా ముఖాన్ని ముట్టుకోకూడదు.జనం లో ఉన్నప్పుడు ఉమ్మడం కానీ, దగ్గడం లేదా తుమ్మడం చేయకూడదు. తుమ్మడం, దగ్గడం చేసినపుడు కర్చీఫ్ తో కానీ లేదా టిష్యూ తో కానీ అడ్డంగా పెట్టుకోవాలన్నారు .ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య జడ్పిటిసి.ఎంపీడీవో. రవీందర్ సర్పంచ్ గుండేటి బాబు ఎంపీటీసీ మల్లయ్య డా ఉదయ్ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది. ఎంపిటిసిలు సర్పంచులు చైర్మన్లు సెక్రెట్రీస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు