ఓరుగల్లు9నేషనల్ టీవీ :తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల తిరుపతి జిల్లాలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. తిరుపతి పట్టణంతో పాటు తిరుమలలోనూ సోమవారం ( నవంబర్ 6) వర్షం కురిసింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రీవారి దర్శనానికి అంతరాయం కలిగింది. స్థానికంగా ఉండే ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు తిరుమలలో ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. సోమవారం ( నవంబర్ 6) కురిసిన వర్షంతో శ్రీవారి ఆలయ పరిసరాలతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలు జలమయమయ్యాయి. దర్శనానికి క్యూలైన్లలో వెళ్లిన భక్తులతో పాటు బయట వేచి ఉన్న భక్తులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. వర్షంతో భక్తులు అతిథిగృహాలకు చేరుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు
వర్షం కారణంగా తిరుమలలో చలి తీవ్రత మరింత పెరిగింది. వర్షం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ముఖ్యంగా భక్తులు తిరుమలలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షం పడుతున్న సమయంలో భక్తులు సురక్షితం ప్రాంతాల్లో ఉండాలని తెలిపారు. తిరుమల ఘట్ రోడ్‌లో కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో వాహనదారులు అప్రమత్తంగా వాహనాలు నడపాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.