Friday, November 15, 2024

తిరుమల ఆలయాన్ని మూసివేయనున్నారు… ఓరుగల్లు 9నేషనల్ టీవీ

ఓరుగల్లు 9నేషనల్ టీవీ :పాక్షిక చంద్రగ్రహణం కారణంగా 2023 అక్టోబర్ 28న తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. సుమారు 8 గంటల పాటు ఆలయ తలుపులు మూసివేయనున్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈ నెల 29న తెల్లవారుజామున 1.05 గంటల నుంచి 2.22 గంటల మధ్య గ్రహణం ఉండగా గ్రహణ సమయానికి 6 గంటల ముందు తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది

ఈ క్రమంలో అక్టోబర్ 28 రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులు మూసి వేయనున్నట్లుగా టీటీడీ అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 28న సహస్రదీపాలంకరణ సేవ, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. తిరిగి 29వ తేదీన ఆలయాన్ని శుభ్రం చేసి తెల్లవారుజామున 3.15 గంటలకు తెరవనున్నారు. తిరుమల ఆలయంతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను పాక్షిక చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నారు.

పాక్షిక చంద్రగ్రహణం కారణంగా 2023 అక్టోబర్ 28న తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. సుమారు 8 గంటల పాటు ఆలయ తలుపులు మూసివేయనున్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈ నెల 29న తెల్లవారుజామున 1.05 గంటల నుంచి 2.22 గంటల మధ్య గ్రహణం ఉండగా గ్రహణ సమయానికి 6 గంటల ముందు తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ క్రమంలో అక్టోబర్ 28 రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులు మూసి వేయనున్నట్లుగా టీటీడీ అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 28న సహస్రదీపాలంకరణ సేవ, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. తిరిగి 29వ తేదీన ఆలయాన్ని శుభ్రం చేసి తెల్లవారుజామున 3.15 గంటలకు తెరవనున్నారు. తిరుమల ఆలయంతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను పాక్షిక చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular