ఓరుగల్లు9న్యూస్ ప్రతినిధి:-జననీ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న తెలంగాణ గెజిటెడ్ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు
ఈ సమావేశంలో చిన్నతరహా మధ్యతరహా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలకు ఎలా ఏర్పాట్లు చేసుకోవాలనే అంశంపై ఈ సర్వసభ్య సమావేశానికి నూతన కార్యవర్గ పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పత్రికల చానల్స్ల జర్నలిస్టులతో పాటు మహిళా జర్నలిస్టులను ఈ సంఘంలో తీసుకొని వారికి ప్రత్యేక హోదాను కల్పించడం ఏర్పాటు చేశారు

ఆర్గనైజింగ్ సెక్రటరీ& ఉపాధ్యక్షులు మరుపట్ల జయపాల్ మాట్లాడుతూ….పదవులకే పరిమితం కాకుండా మాటలతో చెప్పకుండా చేతల్లో పనులు నిర్వహించాలని ఈ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు
అతి త్వరలో ఇండ్ల స్థలాల కోసం వివిధ ప్రాంతాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులను సంప్రదిస్తామని చిన్న మధ్య తరహా తేడా లేకుండా ప్రతి జర్నలిస్టుకి ఈ సంఘంలో ఇండ్ల స్థలాలు ఏర్పాటు విషయంలో ఈ సంఘం పాలకవర్గం ముందుంటుందని అన్నారు.అలాగే జర్నలిస్టుల కోసం ఇన్సూరెన్స్ పాలసీను (ప్రమాద భీమా) కూడా ఏర్పాటు చేస్తున్నామని, అనారోగ్య పరిస్థితుల్లో ఈ సంఘంలో ఉన్న ఏ జర్నలిస్టుల కైనా సంఘం తరఫున ప్రతి సభ్యుడు తన వంతు సహాయం అందిస్తామని తెలిపారు

అలాగే మహిళా జర్నలిస్టులలో వివిధ ఛానల్స్ కి చెందిన న్యూస్ న్యూస్ ప్రెసెంటర్స్ స్వప్న, రమ్య , రజిని, రమ్య శ్రీ, మంజుల… ఇతర సీనియర్ జర్నలిస్టులు ఈ సమావేశంలో పాల్గొని వారికి సంబంధించిన సలహాలు సూచనలు వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం నుండి గాని ప్రజా ప్రతినిధుల నుండి గాని మన చిన్న మధ్య తరహా జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు


జనని హౌసింగ్ సొసైటీ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ మహిళా జర్నలిస్ట్ అవార్డు తీసుకున్న జర్నలిస్ట్ రజిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించినందుకు ప్రతి మహిళా జర్నలిస్టులను గుర్తించాలని ఈ సంఘం జర్నలిస్టులు కోరారు మహిళా జర్నలిస్టు ముందుకు రావాలని ఇలాంటి సంఘంలో పాల్గొనాలని కోరారు

ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు శ్రీధర్, ప్రధాన కార్యదర్శి దామోదర్ కోశాధికారి సునీల్ ఉప కోశాధికారి రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ& ఉపాధ్యక్షులు మరపట్ల జయపాల్ సంఘం జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు