ఓరుగల్లు9నేషనల్ టీవీ :శ్రీ హనునద్గిరి పద్మాక్షి దేవస్థాన ఆస్థాన వేదపండితులు నాగిళ్ళ షణ్ముఖ పద్మనాభ అవధానికి రాష్ట్ర స్థాయి లో పొందిన వేదరత్న అనే ఉగాది పురస్కారాన్ని పురస్కరించుకొని ఈ రోజు 21-3-2025 శుక్రవారం 10:00 లకు దేవాలయము లో
శ్రీ హనుమద్గిరి పద్మాక్షి పరపతి సేవాసంస్థ మరియు పద్మాక్షి చారిటబుల్ ట్రస్ట్ కార్యవర్గం సభ్యులు ఏర్పాటు చేసిన అభినందన సభ కు విచ్చేసిన వరంగల్ అర్బన్ కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి ముఖ్యఅతిథి గా విచ్చేసి అభినందన సభలో వేదపండితుల ను సన్మానించి మునుముందు ఇంకా వేదవిద్య ను 10 మందికి పంచాలని అందుకు నా వంతు సహాయసహకారాలు అందిస్తాము అని తెలపడం అదే విధంగా సేవాసమితి కార్యదర్శి నీలారపు రాజ్కుమారి మాట్లాడుతూ వేదం ఏక్కడ ఐతే ప్రతిధ్వనిస్తుందో అక్కడ దేవతలు సైతం సంచరిస్తారని సన్మాన గ్రహీతలైన వారి దగ్గరి నుండి ఇలాంటి విషయాలు తెలుసుకోవడం సమాజానికి ఉపయోగపడే వైదిక క్రతువులు నిర్వహించగలిగే సత్తా కలవారు దేవాలయపండితులు అని వారికి మనమందరము లోక కళ్యాణార్థమైన కార్యక్రమాలు
ఇంకా ఏన్నో చేయ్యాలని కోరుకుంటూ దేవాలయ వంశపారం పర్య అర్చకులు నాగిళ్ళ శంకర్ శర్మ మాట్లాడుతూ ఇట్టి రాష్ట్ర స్థాయి పురస్కారం ద్వార దేవాలయం యోక్క పేరు వ్యాప్తి చేదడం అదే విధంగా చిన్నవయస్సు సుమారు 16 సం॥ కష్టానికి ఈ రోజు వేదరత్న అవార్డు పొందడం చాల సంతోషంగా అది మన వరంగల్ మోత్తా నికి గర్వకారనమని తెలుపుతూ అభినందన సభ లో దేవాలయ వేదపండితులు
నాగిళ్ళ షణ్ముఖ పద్మనాభ అవధాని దంపతులను గజమాలతో సత్కరించారు ఇట్టి సత్కార్యం లో శ్యాంసుందర్ రెడ్డి,ముక్కాప్రకాశ్,సదానందం,పద్మావతి,ప్రభాకర్ కార్యవర్గం సభ్యులు దేవాలయ భక్తులు పాల్గొన్నారు
