Monday, December 23, 2024

సిమ్( SIM) కార్డ్ నియమాలలో మార్పులు .-ఓరుగల్లు9నేషనల్ టీవీ

మీరు మొబైల్ ఫోన్‌ని ఉపయోగిస్తున్నట్టయితే.. డిసెంబర్ 1 నుంచి సిమ్( SIM) కార్డ్ నియమాలలో రాబోయే మార్పుల గురించి ఇప్పుడే తెలుసుకోండి. ఇది మొదట అక్టోబర్ 1 అని చెప్పిన ప్రభుత్వం.. ఈ అమలును రెండు నెలలు వాయిదా వేసింది. మీరు కొత్త సిమ్ కొనాలని ప్లాన్ చేసినా లేదా సిమ్ కార్డ్ కొన్నా.. ఈ కొత్త నిబంధనలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

స్కామ్‌లు, మోసాలను ఎదుర్కొనేందుకు

నకిలీ సిమ్‌లతో కూడిన మోసాలును ఎదుర్కోవడానికి, టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ సిమ్ కార్డ్‌ల కొనుగోలు, అమ్మకాల కోసం కొత్త నిబంధనలను ప్రవేశపెడుతోంది. పెరుగుతున్న స్కామ్ కేసులను అరికట్టడమే లక్ష్యంగా డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయనున్న ఈ నిబంధనలేంటీ అన్న విషయానికొస్తే…

కఠిన చర్యలు

నకిలీ సిమ్‌ల వల్ల జరిగే మోసాల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలను అమలు చేయడంపై కఠినంగా వ్యవహరిస్తోంది. నిబంధనలను ఉల్లంఘించిన వారికి జైలు శిక్షలతో సహా జరిమానాలు విధించనున్నట్టు వెల్లడించింది.

డిసెంబర్ 1, 2023 నుంచి కీలక మార్పులు

సిమ్ డీలర్ వెరిఫికేషన్: సిమ్ కార్డ్ డీలర్లందరూ తప్పనిసరిగా వెరిఫికేషన్ చేయించుకోవాలి. టెలికాం ఆపరేటర్లు పోలీస్ వెరిఫికేషన్‌కు బాధ్యత వహిస్తూ, సిమ్‌లను విక్రయించడానికి నమోదు చేసుకోవడం ఇప్పుడు తప్పనిసరి. ఇది పాటించడంలో విఫలమైతే రూ.10 లక్షల జరిమానా విధించవచ్చు.

డెమోగ్రాఫిక్ డేటా కలెక్షన్:కస్టమర్లు తమ ప్రస్తుత నంబర్‌ల కోసం సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేస్తే, ఆధార్ స్కానింగ్, డెమోగ్రాఫిక్ డేటా సేకరణ తప్పనిసరి

బల్క్ సిమ్ కార్డ్ జారీ :సిమ్ కార్డ్‌ల జారీల విషయంలో కొత్త నిబంధనలు పెద్దమొత్తంలో అందుబాటులోకి రానున్నాయి. దీని ప్రకారం, వ్యక్తులు వ్యాపార కనెక్షన్ ద్వారా మాత్రమే పెద్దమొత్తంలో సిమ్ (SIM) కార్డ్‌లను పొందగలరు. కస్టమర్లు ఒక IDపై మునుపటిలాగా 9 SIM కార్డ్‌లను పొందవచ్చు.

సిమ్ కార్డ్ డీయాక్టివేషన్ రూల్ :కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత సిమ్ కార్డ్‌లు పెద్దమొత్తంలో జారీ చేయబడవు. SIM కార్డ్‌ని బ్లాక్ చేసి.. ఆ నంబర్ 90 రోజుల వ్యవధి తర్వాత మాత్రమే మరొక వ్యక్తికి కేటాయించబడుతుంది.

జరిమానాలు:కొత్త నిబంధనలకు లోబడి ఉండటానికి సిమ్ అమ్మకం విక్రేతలు నవంబర్ 30 లోపు నమోదు చేసుకోవాలి. ఉల్లంఘిస్తే రూ. 10 లక్షల వరకు జరిమానా, జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular