ఓరుగల్లు9నేషనల్ టీవీ :జీమెయిల్ లో అండ్రాయిడ్ యూజర్ల కోసం మరో అద్బుత ఫీచర్ ను గూగుల్ ఆవిష్కరించింది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ఎమోజీల ద్వారా ఎలా రిప్లై ఇస్తారో…అలాగే Gmailలో కూడా ఎమోజీని ఉపయోగించవచ్చు. ఎమోజీ ద్వారా Gmailలోని ఈమెయిల్‌లకు రిప్లై ఇచ్చే సదుపాయాన్ని గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. Google Gmailలో అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త ఫీచర్ తో ఎమోజీతో ఇమెయిల్‌లకు రెస్పాండ్ అవ్వొచ్చు. వాస్తవానికి ఈ సమాచారం Apple పరికరాల్లోని Gmail యాప్‌లో కనిపించే దాచిన కోడ్‌లో కనుగొనబడింది.
జీమెయిల్ లాగిన్ అయిన సమయంలో సందేశం దిగువన ఎమోజీ కనిపిస్తుంది. మెను నుండి మీ ఎమోజీని ఎంచుకోవడానికి దానిపై క్లిక్ చేయండి. ఆపై సెలక్ట్ చేసుకోని ఎవరికైతే పంపాలని అనుకుంటున్నారో వారికి పంపండి. సోషల్ మీడియా పోస్ట్‌లకు ప్రతిస్పందించడానికి మనలో చాలా మంది ఎమోజీని ఎలా ఉపయోగిస్తారో అదే ఫీచర్ లాగా జీమెయిల్ ఎమోజీ ఉంటుంది
Apple యొక్క iMessage ట్యాప్‌బ్యాక్‌లు iOSలో ఎలా ఉపయోగపడతాయో అదే విధంగా, Gmailలో ఎమోజిలు పని చేస్తాయి.